నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం డేనియల్ పురం గేట్ సమీపంలో ఉన్న జి.పి. వెంకటస్వామి హిందుస్థాన్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ యజమాని గుత్తి శ్రీహరి సౌజన్యంతో 40 వేల రూపాయల విలువ చేసే మూడు చక్రాల సైకిళ్లను అయిదు మంది దివ్యాంగులకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా దాత శ్రీహరిని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,అధ్యక్షులు ఎం.పీ.వీ. రమణయ్యలు శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు.గుత్తి శ్రీహరి భవిష్యత్ లో కూడా దివ్యాంగులకు సహకారం అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జి.పి. వెంకటస్వామి హిందుస్థాన్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ అకౌంటెంట్ మోహన్,లయన్స్ క్లబ్ సభ్యుడు రామయ్య, కార్యాలయ కార్యదర్శి ఆలా మధు, సూర్య,లబ్ధిదారులు పాల్గొన్నారు.
Arattai