NANDYAL Feb 23 :- నంద్యాల పట్టణంలో సోమవారం జిల్లా రజక సేవ సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సంత గాడ్గే బాబా మహారాష్ట్రకు చెందిన గొప్ప సామాజిక సంస్కర్త అని, రజక కులానికి చెందిన వాడని జిల్లా రజక సేవ సంఘం అధ్యక్షుడు నాగరాజు తెలిపారు.

పరిశుభ్రత (స్వచ్ఛత) పై ప్రజలకు అవగాహన కల్పించారని తెలిపారు.సంత్ గాడ్గే బాబా స్వచ్ఛ భారత్ పితామహుడు అని తెలిపారు.గాడ్గే మహారాజ్ ప్రధానంగా స్వచ్ఛత, విద్య, సామాజిక న్యాయం, మూఢనమ్మకాలు, కుల వివక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారనీ, ఆయన కీర్తనలు, భజనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసేవారనీ,. గ్రామాల్లో ధర్మశాలలు, పాఠశాలలు, ఆసుపత్రులు, జంతు ఆశ్రయాలు నిర్మించారనీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా రజక సేవా సంఘం అధ్యక్షులు కొర్రపోలు నాగరాజు, నందవరం చిన్న శ్రీనివాసులు జూటూరు పెద్ద వెంకటేశ్వర్లు కవులూరు శ్రీనివాసులు మల్లయ్య నడిపెన్న తిరుపాలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Arattai