NANDYAL Feb 28:- భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, కర్నూలు కిమ్స్ ఆసుపత్రి సహకారంతో స్థానిక మధుమణి సమావేశ భవనంలో వైద్య సదస్సు నిర్వహించారు.
నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ సదస్సులో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జాతీయ
ఐ.ఎం.ఎ. కేంద్ర కమిటీ సభ్యులు,రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ సదస్సు ప్రారంభించారు.
కర్నూలు కిమ్స్ ఆసుపత్రి న్యూరో సర్జరీ వైద్యనిపుణులు డాక్టర్ సుమంత్ కుమార్ మెదడు, వెన్నెముక శస్త్ర చికిత్సలలో నూతన విధానాలపై ప్రసంగించగా, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో వినూత్న మార్పులపై కర్నూలు కిమ్స్ ఆసుపత్రి పల్మనాలజీ వైద్యులు డాక్టర్ యశోవర్ధన్, డాక్టర్ చిరంజీవి రెడ్డి మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా ప్రసంగించారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్యులు తమ వైద్య పరిజ్ఞానాన్ని నిరంతరం మెరుగుపరుచుకుంటూ, కొత్తగా ఆవిష్కరించిన ఆధునిక వైద్య విధానాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా వక్తలను ఐఎంఏ నంద్యాల తరఫున జ్ఞాపికలు అందించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాసరావు,డాక్టర్ మహమ్మద్ రఫీ లతోపాటు ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, నంద్యాల ఐ ఎం ఎ మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి , అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.
Arattai