NANDYAL :- నంద్యాల పట్టణంలో శనివారం నంది రైతు సమాఖ్య ముఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి ధనలక్ష్మి పేర్కొన్నారు . నంది రైతు సమాఖ్య ముఖ్య సలహాదారు డాక్టర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో శ్రీశైల పబ్లిక్ స్కూల్ లో శనివారం నిర్వహించిన మహిళా సదస్సుకు శాస్త్రవేత్తలు ధనలక్ష్మి, రమాదేవి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మల్లు గీతావాణి, న్యాయవాది శ్రీమతి ఏ శ్రీదేవి , చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ సుష్మ తదితరులు అతిథులుగా హాజరై ప్రసంగించారు. విశిష్ట అతిధి డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు మాట్లాడుతూ
మహిళలకు తగిన చేయూత నందిస్తే బహుముఖ రంగాల్లో ప్రతిభ చాటుతారని పేర్కొన్నారు.
మహిళలు సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవిస్తూ సమున్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఎ. శ్రీదేవి మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలు పెరగాలని, స్త్రీ రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు జరగాలన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ గీతావాణి మహిళలు ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహించాలని కోరారు.. మహిళల్లో వచ్చే క్యాన్సర్ సమస్యల గురించి వివరించారు..సీనియర్ శాస్త్రవేత్త రమాదేవి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో మహిళలు క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు .

ఈ సందర్భంగా నంది రైతు సమాఖ్య సౌజన్యంతో ముద్రించిన “మహిళల రక్షణ చట్టం” అనే పుస్తకాన్ని అతిధులు, సమాఖ్య నిర్వాహకులు ఆవిష్కరించారు.డా. రవీంద్రనాథ్ మాట్లాడుతూ సమాజానికి ఆలంబనగా ,సంస్కృతికి నిదర్శనంగా అద్భుత ప్రతిభా పాటవాలతో మహిళలు నేటి సమాజంలో రాణించడం అభినందనీయమన్నారు… సమాఖ్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుష్మ మాట్లాడుతూ విద్య, వైద్య,శాస్త్రీయ రంగాల్లో బాలికలు అభివృద్ధి సాధించడానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీనియర్ శాస్త్రవేత్త రమాదేవి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో భారతీయ స్త్రీలకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు… నవసమాజ నిర్మాణంలో మహిళల పాత్ర స్ఫూర్తిదాయకమన్నారు.. ప్రతి మహిళా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించాలన్నారు. చర్చా వేదికల వక్తలు మాట్లాడుతూ స్త్రీలు సంస్కృతి, సహనానికి ప్రతిరూపాలుగా వర్ణించారు.. పిల్లల పెంపకం,కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ వ్యాపార రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారని అవకాశాలను సృష్టించుకుని మహిళలు స్ఫూర్తిదాయకంగా ప్రగతి వైపు పయనించాలన్నారు.

ఉత్తమ మహిళా రైతుగా ఎంపికైన శ్రీమతి బత్తులపుష్పావతి గారిని అతిధులను సమాఖ్య కార్యదర్శి కృష్ణారెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి,రైతు సమాఖ్య నాయకులు మధుసూదన్ రెడ్డి , ఓబుళపతి ,రఫీ తదితరులు ఘనంగా సత్కరించారు… కార్యక్రమంలో శ్రీశైల పాఠశాల ప్రధానోపాధ్యాయులు నబి సాహెబ్, స్పెషల్ ఆఫీసర్ మురళీకృష్ణ, భారతీ బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, కవి నీలకంఠమాచారి, శ్రీశైల స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Arattai