NANDYAL :- ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల గైనకాలాజి సొసైటీ, నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో, గైనకాలాజి సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నాగమణి, డాక్టర్ వసుధ, కోశాధికారి డాక్టర్ సునీత ల నిర్వహణలో మధుమణి సమావేశ భవనంలో జరిగిన కార్యక్రమంలో గైనకాలాజి సొసైటీ స్త్రీ వ్యాధుల పై వైద్య సదస్సు నిర్వహించారు.
సదస్సులో వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ ఇందుమతి, డాక్టర్ వసుధ, డాక్టర్ సౌజన్య, డాక్టర్ గీత, డాక్టర్ శిల్పా, డాక్టర్ సునీత వివిధ స్త్రీ వ్యాధులపై మల్టీ మీడియా సహకారంతో ప్రసంగించారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐ ఎం ఎ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, రాష్ట్ర ఐ ఎం ఎ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు,డాక్టర్ మధుసూదన రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహిళా సాధికారత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళ లను అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
డాక్టర్ నాగమణి,డాక్టర్ వసుధ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ “గివ్ టు గైయిన్” నినాదం ప్రకారం మహిళల హక్కులు,సామాజిక న్యాయం కోసం కార్యచరణ ప్రధానం అన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ మహిళా వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద లకు మహిళా దినోత్సవ సత్కారం చేశారు. నవజీవన్ బధిరుల పాఠశాల బాలికలకు రెండు కుట్టు మిషన్లు కుట్టు పని శిక్షణ కోసం మహిళా వైద్యుల తరఫున ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా వైద్యులు పాల్గొన్నారు.
Arattai