NANDYAL :- ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని శ్రీ బద్రావతి భావనారాయణ స్వామి వారి దేవాలయ కళ్యాణమండపం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 8వ తారీఖున విజయవాడ శ్రీ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా భీమనపల్లె వెంకటసుబ్బయ్య ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు చెన్న వెంకటేశ్వర్లు గాజుల శంకర్ గారు పుత్తరామకృష్ణ సతీష్ మద్దాల మోహన్ పాల్గొన్నారు కార్యదర్శి గుద్దేటి వెంకటరామయ్య, ప్రచార కార్యదర్శి చింతలపల్లి వాసు సింగరి సురేష్ కోట బాల వెంకటసుబ్బయ్య చేపూరి మురళీకృష్ణ దోమల చక్రపాణి పల్లె ఈశ్వరయ్య మహిళా సంఘ సభ్యురాలు జింక రాజేశ్వరి కోట వెంకటరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భీమనపల్లె వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ నాకు ఇంతటి బాధ్యతను ఇచ్చిన అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు అఖిలభారత సంఘం పెద్దలు శ్రీ కందగడ్ల స్వామి గడ్డం జగన్నాథం ఉపాధ్యక్షులు. వద్ది నరసింహులు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పద్మశాలి సంఘం సంక్షేమ, అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ మేరకు జిల్లాలోని ప్రముఖులు వారికి అభినందనలు తెలిపారు.
Arattai