సీనియర్ యూరాలజిస్ట్ డా॥భార్గవవర్ధన్ రెడ్డికి సత్కారం
యూరాలజిస్ట్ ను సత్కరించిన రోటరీక్లబ్
NANDYAL :- నంద్యాల పట్టణంలోనీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నందు కిడ్నీ మరియు యూరాలజీ సెంటర్ నిర్వహిస్తున్న ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డా॥ కె.భార్గవ వర్ధన్ రెడ్డి గారిని మరియు కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ శివ గారిని ‘వరల్డ్ కిడ్నీ డే ‘ సందర్భంగా గురువారం మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా మిడ్ టౌన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు కేశవమూర్తి, కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం కిడ్నీ వైద్యంలో రాయలసీమలో మొట్టమొదటి లేజర్ ట్రీట్ మెంట్ సెంటర్ ను నంద్యాలలో ఏర్పాటుచేసి వైద్యసేవలందించిన ఘనత డా॥భార్గవవర్ధన్ రెడ్డికే దక్కిందన్నారు.

ఈ సందర్భంగా డా.భార్గవవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ ,షుగర్ లను ను అదుపులో ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు డి.వి.సుబ్బయ్య, అన్నెం శ్రీనివాసరెడ్డి,శేషఫణి,డా.నీలం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Arattai