AMARAVATHI Mar13 :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖను మరింత బలోపేతం చేసే దిశగా కొత్తగా నియమితులైన 28 మంది అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు మరియు 3 మంది జూనియర్ అసిస్టెంట్లకు సచివాలయంలోని 5 బ్లాక్ లో కాన్ఫరెన్స్ హాల్ నందు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు

కార్మిక శాఖను సమర్థవంతంగా నడిపించడానికి మరియు కార్మికులకు మెరుగైన సేవలు అందించడానికి కొత్తగా నియమితులైన అధికారులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. నూతనంగా నియమితులైన అధికారులందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి సూచించారు. కార్మికుల హక్కులను రక్షించడం తమ ప్రధాన బాధ్యతగా భావించి విధులు నిర్వర్తించాలని అన్నారు. పరిశ్రమలు మరియు కార్మికుల మధ్య సమతుల్యతను కాపాడుతూ కార్మిక చట్టాల అమలులో పారదర్శకతతో వ్యవహరించాలని పేర్కొన్నారు.

కార్మిక సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా అసంఘటిత కార్మికుల నమోదు మరియు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలులో అధికారులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ప్రతి జిల్లాలో కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా పని చేయాలని, కార్మికులకు న్యాయం జరిగేలా చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. యువ అధికారులు తమ విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్న మంత్రి, కార్మిక శాఖ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి మరియు కార్మిక సంక్షేమం రెండూ సమానంగా ముందుకు వెళ్లాలని తెలిపారు.

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ధర్మమని పేర్కొన్న మంత్రి, ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉందన్నారు.నూతనంగా నియమితులైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, జాయింట్ కమిషనర్ లక్ష్మీనారాయణ కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఏఎల్ఓ లు, అధికారులు పాల్గొన్నారు.
Arattai