NANDYAL Mar14 :- నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో, పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు లో ఉన్న జి ఎస్ ఆర్ ఆసుపత్రిలో ప్రముఖ ఎముకలు, కీళ్ల శస్త్ర చికిత్స నిపుణులు, నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ రంజాన్ మాసం పురస్కరించుకుని గత నెల 18వ తేదీన ప్రారంభమైన ఉచిత ఎముకలు, కీళ్ల ఓ.పి.డి. చికిత్సలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గత 24 రోజులలో 18 వందల మందికి ఉచితంగా ఓ.పి. వైద్య సేవలు డాక్టర్ మహమ్మద్ రఫీ అందించారు. శస్త్ర చికిత్సలు అవసరమైన 40 మంది అర్హత కలిగిన రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ వరకు ఈ ఉచిత సేవలు కొనసాగిస్తామని తెలిపారు
ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవి కృష్ణ,రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్,రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్,డాక్టర్ విజయభాస్కర రెడ్డి,ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్,మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ డాక్టర్ మహమ్మద్ రఫీ నెల రోజులు పైగా ఉచిత వైద్య సేవలు అందించడం ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం అన్నారు.
Arattai