NANDYAL :- ఐ.ఎం.ఎ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఆదివారం స్థానిక మధుమణి సమావేశ భవనంలో రాష్ట్ర ఐ.ఎం.ఎ. మూడవ జోన్ లోని రాయలసీమ,నెల్లూరు జిల్లాలలో ఉన్న పట్టణ,నగర శాఖల నాయకులకు ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు.ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాల రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యశాల ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాల రాజు మాట్లాడుతూ . సామాజిక బాధ్యత లో భాగంగా ఐ.ఎం.ఎ. శాఖలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఐఎంఏ శాఖల ద్వారా వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలలో భాగంగా వైద్య రంగంలో వస్తున్న ఆధునిక విధానాలు, మార్పులపై వైజ్ఞానిక సదస్సులు రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు.

కార్యాశాలలో అధ్యక్ష కార్యదర్శుల బాధ్యతలపై ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాల మద్దయ్య, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి ప్రసాద్, ఐఎంఏ శాఖల పరిపాలన, నిర్వహణ విధానం, ఐఎంఏ వైద్యుల రాష్ట్ర సంక్షేమ పథకాలపై ఐఎంఏ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోలవరపు ఫణిధర్,ఐఎంఏ జాతీయ, రాష్ట్ర వైజ్ఞానిక విభాగాలపై, ప్రచురణ లపై ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ పి.ఎస్. శర్మ, ఐఎంఏ ఆవిర్భావ చరిత్ర, ఐఎంఏ కేంద్ర, రాష్ట్ర శాఖల నిర్మాణంపై, వివిధ అనుబంధ విభాగాల గురించి, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు విధానాలపై ఐఎంఎ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నాయకత్వ లక్షణాలపై, నాయకులకు అవసరమైన భావ ప్రకటన,ఉపన్యాస నైపుణ్యాలపై ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు, ప్రసంగించారు.

ఐఎంఏ రాష్ట్ర నాయకులను, వక్తలను నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహమ్మద్ రఫీ,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి,రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, కార్యశాల కన్వీనర్ డాక్టర్ విజయభాస్కర రెడ్డి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్,ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు త్యాగరాజ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏవి సుబ్బారెడ్డి, రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుండి వివిధ ఐఎంఏ పట్టణ శాఖలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
Arattai