NANDYAL Mar20 :- నంద్యాల పద్మావతి నగర్ స్టేడియం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రమోద్ గ్యాస్ట్రో లివర్ కేంద్రం,వాణి కిడ్స్ ఆసుపత్రి ని శుక్రవారం జాతీయ ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు.

మెడికల్ గ్యాస్ట్రో ఎంటిరాలజీ, లివర్ సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రమోద్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీవాణి గతంలో శ్రీనివాస జూనియర్ కళాశాల నిర్వహించిన భవనంలో నూతనంగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

చిన్నపిల్లల వైద్య విభాగాన్ని హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న స్త్రీ, శిశు మెడికవర్ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ రవీంద్రారెడ్డి ప్రారంభించారు.వివిధ ఓపిడి,ఎండోస్కోపీ విభాగాలను నంద్యాల ఈమె మాజీ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదన రావు, రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్,గ్యాస్ట్రో ఎంటరాలజీస్ట్ డాక్టర్ భార్గవరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి ,డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ సునీత లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్ రెడ్డి,డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో గ్యాస్ట్రో మరియు లివర్ సంబంధిత మెడికల్ చికిత్సలు ,చిన్నపిల్లల చికిత్సల కోసం అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదనరావు లు మాట్లాడుతూ నంద్యాలలో అత్యాధునిక మెడికల్ గ్యాస్ట్రో, లివర్ ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా ఇదే ఆసుపత్రిలో చిన్న పిల్లల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇద్దరు వైద్యులు మంచి కళాశాలలో సూపర్ స్పెషాలిటీ వైద్యులుగా ఉత్తీర్ణులై, ఏఐజి మరియు మెడికవర్ ఆసుపత్రులలో పనిచేసి తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుని నంద్యాలలో వైద్య సేవలు అందించడానికి రావడం ప్రశంసనీయమన్నారు.ఈ ఆసుపత్రి ద్వారా నంద్యాల ప్రాంత ప్రజలకు మంచి ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలోడాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదన రావు, రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి , నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ సునీత , ఉదయానంద గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ భార్గవరెడ్డి,డాక్టర్ వినోద్, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి ,డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, అధిక సంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు.
Arattai