NANDYAL Mar24:- నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సంఘం కార్యాలయంలో దివ్యాంగులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య ల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో జి.పి.వెంకటస్వామి పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు గుత్తి శ్రీహరి సౌజన్యంతో బనగానపల్లె కు చెందిన దివ్యాంగురాలు బాల సుబ్బమ్మ కు మూడు చక్రాల సైకిల్ ని అందజేశారు.
నంద్యాలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుష్మ సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు నెలవారి మందులను పంపిణీ చేశారు.పదిమంది దివ్యాంగులకు ఐఎంఏ నంద్యాల హెల్త్ కార్డులను ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య మాట్లాడుతూ అవసరమైన దివ్యాంగులకు నెలవారి మందులు పంపిణీ, మూడు చక్రాల సైకిళ్లు,చక్రాల కుర్చీలు,వినికిడి యంత్రాలు,చంక కర్రలు వంటి ఉపకరణాలు అందజేసే సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల కాలంలో నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ద్వారా ఐఎంఏ హెల్త్ కార్డులను దాదాపు నాలుగు వేల మందికి అందజేశామని. ఈ కార్డుల ద్వారా నంద్యాల ఐఎంఏ వైద్యుల ఆసుపత్రులలో ఉచిత ఓ.పి.డి సేవలు పొందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ హెల్త్ కార్డులు అవసరమైన వారు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం లో సంప్రదించాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రతి ఏటా పబ్బు తులసి కృష్ణ పద్మశాలియ ట్రస్ట్ తరపున దివ్యాంగులకు ఒక కుట్టు మిషన్ అందజేస్తున్న పబ్బు తులసి కృష్ణ ను, నెల రోజులు ఉచిత ఓ పి డి సేవలు అందించి ఇకపై ప్రతి గురువారం పేద వారందరికీ ఉచిత ఓపిడి సేవలు అందిస్తామని ప్రకటించిన ప్రముఖ ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు, నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ లను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ వి రమణయ్య, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ,లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, సభ్యులు రామయ్య, పబ్బు తులసి కృష్ణ, దివ్యాంగ లబ్ధిదారులు పాల్గొన్నారు.
Arattai