NANDYAL Mar24:- నంద్యాలలోని శాంతీరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ (CSE) చదువుతున్న టీ. వెంకటేశ్వరి, జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికై కళాశాలకు గర్వకారణంగా నిలిచారు.
అనంతపురంలోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో మార్చి 18వ తేదీన JNTUA (జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం) ఖో-ఖో జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వెంకటేశ్వరి తన అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటి యూనివర్సిటీ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.
వెంకటేశ్వరి ఏప్రిల్ 1 నుండి 4 వరకు కర్ణాటకలోని దావణగెరె యూనివర్సిటీలో జరగనున్న దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల (South Zone Inter-University) ఖో-ఖో టోర్నమెంట్లో పాల్గొననున్నారు.
వెంకటేశ్వరి సాధించిన ఈ విజయం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి. సుబ్రహ్మణ్యం, ఫిజికల్ డైరెక్టర్ చంద్రారెడ్డి, CSE హెడ్ ఫారూక్, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
Arattai