ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 29 వ తేదీ ,ఆదివారం ఉదయం 9 గంటల కు పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని జింకాస్ డ్రాయింగ్ హాల్ నందు నంద్యాల జిల్లా స్థాయి 15 సంవత్సరముల లోపు బాల బాలికలకు వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్.రవికృష్ణ,కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు.
ఈనెల 27 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లో ఎంట్రీలు నమోదు చేసుకోవాలని,నంద్యాల జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు జూన్ నెలలో గుడివాడలో జరగబోవు రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
చెస్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్, ఎన్.ఆర్.జి. చెస్ అకాడమీ గౌరవ అధ్యక్షులు రాజేష్, పర్యవేక్షకులు వెంకట్రావు, ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు.ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9010451585.
Arattai