ఈనెల 18వ తేదీ నుండి 21వ తేదీ భువనేశ్వర్ లో ఉన్న కళింగ స్టేడియంలో జరిగిన 24వ జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తరపున పాల్గొన్న నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన గౌతమ్ షాట్ పుట్ క్రీడా విభాగంలో సిల్వర్ మెడల్ (రజత పతకం) సాధించిన సందర్భంగా గురువారం స్థానిక నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో, నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్ ను శాలువా, బహుమతులతో ఘనంగా సత్కరించారు.
నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శి రమణయ్య, లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ సుధాకర్ రెడ్డి పాల్గొని గౌతమ్ ను అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, సోమేశుల నాగరాజు మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు గౌతమ్ గత నెల నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో స్వర్ణ పతకం సాధించి జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొని రజత పతకం సాధించడం ప్రశంసనీయమన్నారు. అంతర్జాతీయ పోటీలలో దేశం తరఫున పాల్గొనడానికి బెంగళూరులో ఉన్నతస్థాయి శిక్షణ కోసం గౌతమ్ ఎంపిక కావడం విశేషం అన్నారు.
గౌతమ్ అంతర్జాతీయ దివ్యాంగ క్రీడలలో దేశానికి పతకం సాధించి భారత దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తమ సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామన్నారు.క్రీడలలో ఆసక్తి ఉన్న దివ్యాంగులు దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంప్రదిస్తే తగిన విధంగా ప్రోత్సహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ సుధాకర రెడ్డి, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి రమణయ్య, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చంద్రమోహన్, నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నయ్య, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్, కార్యాలయ కార్యదర్శి ఆలా మధు పాల్గొన్నారు.
Arattai