నంద్యాల పట్టణంలోని E.S.C ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు ఏప్రిల్ 4వ తేదీ నుండి POLYCET-2026 ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ తెలిపారు.SSC పరీక్ష లేదా తత్సమాన పరీక్ష కు హాజరైన/ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు.
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET-2026) ఉచిత శిక్షణకొరకు దరఖాస్తు పత్రాలు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్,నందు (ESC Government Polytechnic) ఈనెల 28 తేదీ నుండి పొందవచ్చునని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 2వ తేదీ లోపల సమర్పించాలని తెలిపారు.
అమ్మాయిలకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అర్హులైన విద్యార్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.మరిన్ని వివరములకు హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్ సురేష్ బాబు (9912377723) మరియు ఇంగ్లీష్ లెక్చరర్ నాగరాజ (9885037114) సంప్రదించాలని తెలిపారు.
Arattai