వైసీపీ నాయకుల నిరసనను అడ్డుకోవడం సరికాదు : మాజీ ZPTC ఫ్లోర్ లీడర్ లాలి స్వామి
NANDYAL Sep 01 :- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో వెలుగోడు రిజర్వాయర్ నుంచి సాగునీరు,తాగునీటిని అందించాలంటూ వైసీపీ నాయకులు చేపడుతున్న ఉద్యమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారని ZPTC ఫ్లోర్ లీడర్ లాలి స్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రైతుల ప్రయోజనాల కోసం సాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ ఉద్యమం చేపడుతున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడం సరికాదని అన్నారు.ప్రజలు,రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు.
రైతుల ప్రయోజనాల కోసం సాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ ఉద్యమం చేపడుతున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలు, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు.
వెలుగోడు రిజర్వాయర్ నీటిని సాగుకు అందించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని లాలి స్వామి డిమాండ్ చేశారు.పోలీసుల ఆంక్షలతో ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నించడం తగదని ఆయన అన్నారు.
Arattai