నంద్యాల పట్టణంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆచారి ముఖ్యఅతిథిగా నేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్,రిటైర్డ్ నీటిపారుదల శాఖ డి ఈ రాజశేఖర్, రిటైర్డ్ హెడ్మాస్టర్ చంద్రశేఖర్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. 2025 మార్చి లో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన 18మంది ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు పారితోషికము,మెమొంటో,నోటు పుస్తకాలు అందజేశారు.విశ్వబ్రాహ్మణ విద్యార్థుల విద్యాభివృద్ధికి తమవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని విశ్వబ్రాహ్మణ సమితి సభ్యులు తెలిపారు.ప్రతి సంవత్సరం విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.
Leave a Reply