సీఎం నారా చంద్రబాబునాయుడు గారు మరియు విద్య మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ బుధవారం నంద్యాల 24 వ వార్డు టిడిపి ఇంచార్జ్ సాయిరామ్ రాయల్ , జ్యోతి రాయల్ గార్లు సాయిబాబా నగర్ నందు ఏర్పాటుచేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు . ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని మై టిడిపి యాప్ లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పేదరికానికి కూడా ముగింపు ఇచ్చేలా మద్దతు ధరలు, పంటబీమా, ఉచిత బోర్‌వెల్లు పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, PHCల్లో మెరుగైన సేవలు విద్యార్థులకు తల్లికి వందనం , స్కూళ్ల ఆధునికీకరణ, మహిళలకు డ్వాక్రా బలోపేతం, ఉచిత రేషన్, మహిళా భద్రత, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ అవకాశాలు, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారుల అభివృద్ధి, స్మార్ట్ గ్రామాల దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు . రానున్న ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు . సంవత్సరాల కాలంలో నంద్యాలలో నియోజకవర్గంలో రోడ్లు , కాలువలు , మంచినీటి వసతి లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు . రానున్న నాలుగు సంవత్సరాల్లో భారీగా నిధులు తెచ్చే విధంగా ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నామన్నారు . ఇది మొదటి అడుగు మాత్రమేనని రాబోయే నాలుగేళ్లు అభివృద్ధి పథంలో తిరుగులేని ప్రయాణం చేస్తామని తెలిపారు . ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యంగా ప్రతి ఇంటికీ అభివృద్ధే గమ్యంగా పని చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ శివశంకర్ యాదవ్ ,మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు , అజ్మీర్ , స్వామి నాయక్ , మంజుల సుబ్బరాయుడు , శ్రీదేవి , నాగార్జున , తోట చిన్న సుబ్బయ్య , జయ ప్రకాష్ , బ్యాంకు తిమ్మయ్య , జనార్ధన్ గౌడ్ , సుంకన్న , లాయర్ బాబు , కోమలి మధు , నాగరత్నమ్మ , విజయ గౌరీ , భారతి , జ్యోష్న ,రవికుమార్, బూతు ఇంచార్జ్ జాకీర్ హుస్సేన్, కరిష్మా భాను, కృష్ణవేణి, జయలక్ష్మి, అరుణ్ రషీద్, పాములేటి, రాధిక, పయలాల మధు, ఆటో మా భాష, ఉప్పరి పేట మా భాష, షేక్ కరీ మొగల్ కమాన్ తదితరులు పాల్గొన్నారు
Leave a Reply