పిజిఆర్ఎస్ దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించండి:జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీతకాల పరిమితిలోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాల్లో డిఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ అర్జీదారులు సమర్పించిన ప్రతి అర్జీని జాగ్రత్తగా చదివి, అందులో పేర్కొన్న అంశాలను కూలంకషంగా పరిశీలించి, సరైన రీతిలో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన 2,017, రీ ఓపెన్ అయిన దరఖాస్తులు 539 ఉన్నాయని గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ స్వీకరణ తక్కువ శాతం ఉందని వేగవంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత మండల తహసీల్దారులను ఆదేశించారు.

AP-ఎపి సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా సాగిన మంత్రుల బృందం సమావేశం

అన్ని సంక్షేమ హాస్టళ్ళు, స్త్రీ శిశు సంరక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత క్షేత్రాధికారులు తనిఖీలు నిర్వహించి సంబంధిత ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ళలో తనిఖీలు నిర్వహిస్తూ లోపాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 222 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. అన్ని అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ డిఆర్ఓ జారీ చేసారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు