October 13:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెవి, ముక్కు, గొంతు అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్ హోటల్ లో గత మూడు రోజులుగా జరిగిన సంయుక్త 20 వ దక్షిణ భారతదేశ,43 వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెవి, ముక్కు, గొంతు వైద్యుల సదస్సులో నంద్యాల మధుమణి ఆసుపత్రి చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ మణిదీప్ “స్పీనాయిడ్ సైనస్ శస్త్ర చికిత్స” లపై యువ వైద్యుల విభాగంలో సమర్పించిన పరిశోధన పత్రానికి ఉత్తమ పరిశోధన పత్రంగా యువ విభాగంలో బంగారు పతకానికి ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెవి,ముక్కు, గొంతు వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ అప్పారావు, డాక్టర్ మూర్తి, డాక్టర్ రెహమాన్, డాక్టర్ కృష్ణ కిషోర్, డాక్టర్ కుమార్ చౌదరి లు ఈ పురస్కారాన్ని డాక్టర్ మణిదీప్ కు సదస్సు ముగింపు కార్యక్రమంలో అందజేశారు.
ఈ పురస్కారం అందుకున్న సందర్భంగా డాక్టర్ మణిదీప్ ను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జి. రవికృష్ణ, రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షులు విజయభాస్కర రెడ్డి, రాష్ట్ర ఐఎంఏ మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య,నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ పనిల్ కుమార్,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హరిత,నంద్యాల గైనకాలజీ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నాగమణి,డాక్టర్ వసుధ లు అభినందించారు.
Leave a Reply