శ్రీశైలంలో అభిషేకాలు రద్దు,విడతల వారీగా మల్లన్న స్పర్శ దర్శనం

శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 21 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు.

కార్తిక మాసంలో రూ.5 వేల గర్భాలయ అభిషేకం టికెట్లు, రూ.1500 సామూహిక అభిషేకం టికెట్లు రద్దు చేసినట్లు తెలిపారు. రోజూ విడతల వారీగా మల్లి కార్జునస్వామి స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు.

AP-రాష్ట్రంలో కొత్తగా ఏడు డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్

శని, ఆది, సోమవారాల్లో అమ్మవారి అంతరాలయంలో కుంకు మార్చనలు నిలిపేసి.. ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తామన్నారు. ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, నవంబర్ 14న కోటి దీపోత్సవం, 18న తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హోమాలు, కల్యాణాలు యథావిధిగా జరుగుతాయన్నారు.

“మీ డబ్బు – మీ హక్కు” పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

📖 Also Available as Web Story

Experience this content as an engaging Web Story - perfect for mobile reading!

🎬 View Web Story
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.