NANDYAL:- నంద్యాల పట్టణంలోని రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ కళాశాల నందు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వి.వెంకట బసవ రావు సూచనల మేరకు బాల బాలికలకు వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ కళాశాల సెక్రటరీ దామోదర కుమార్ రెడ్డి,యూనివర్సిటీ కోఆర్డినేటర్ కవిత,కళాశాల ప్రిన్సిపాల్ జి.లక్ష్మీదేవి తెలిపారు.ఈ శిబిరంలో బాల బాలికలకు ఆసన,ప్రాణాయామ,జల దౌతి,జల నేతి,సూత్ర నేతి క్రియలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ శిబిరం వల్ల బాల,బాలికల్లో శారీరిక,మానసిక ఉల్లాసం, సృజనాత్మక శక్తి,ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని తెలిపారు
Arattai