నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం కొల్ల బత్తుల కార్తీక్ నూతన జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా, సహచర అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ కొల్ల బత్తుల కార్తీక్ మాట్లాడుతూ ప్రజా ...