NANDYAL July03:- నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు శుక్రవారం నాడు పుస్తక ఆవిష్కరణ మహోత్సవం అనే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పుస్తక రచయిత అయినటువంటి కే. సి .వెంకటేశం గారు, పుస్తక సమీక్షలు శ్రీ డా. గెలివి సహదేవుడు గారు, మరియు పుస్తక స్వీకర్త ప్రొఫెసర్ డా. రామకృష్ణారెడ్డి గారు, g.రమేష్ గారు, c.సయ్యద్ జాఫర్ గారు, సుబ్బారాయుడు గారు మరియు టెలికాం సభ్యులు అలాగే విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముందుగా ఈ కార్యక్రమాన్ని పుస్తక ఆవిష్కరణతో ప్రారంభించారు. పుస్తకం పేరు “కర్నూలు జిల్లా టెలికాం చరిత్ర” పుస్తక స్వీయకర్త డా.జి.రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులకు మరియు విద్యార్థులకు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్వకాలంలో ఎంతో ఆలస్యంగా సమాచారం ఒకరి నుంచి ఒకరికి చేర వేసేవారు కానీ ఇప్పుడు పెరిగిన ఆధునిక సాంకేతికత వలన త్వరగా సమాచారం ఇతరులకు చేరవేయడం ద్వారా దాని వలన కలిగే ప్రమాదాన్ని నివారిస్తున్నాము మరియు సమయాన్ని కూడా ఎంతో కాపాడుకుంటున్నామని తెలియజేశారు. యు టెలికాం సంస్థ వారే మనకు ఇంటర్నెట్ అవకాశం కల్పించారు. మొట్టమొదటిగా మన కళాశాలకు ఇంటర్నెట్ ఎస్టిడి చరవాణి సదుపాయాన్ని కలిగించారు. ఇప్పుడున్న సమాజంలో ఎంతో మార్పు వచ్చింది ఆధునికత పెరగడం వలన ఎంతో మంది విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు.

చరవాణిని మొట్టమొదటగా పరిచయం చేసింది బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ వారు. కే. సి .వెంకటేశం గారు ఈ పుస్తకమే కాకుండా ఇంకా రెండు పుస్తకాలు రాశారు అవి కూడా మీకు ఉపయోగపడతాయి అన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఆయన రిటైర్డ్ అయ్యాక కూడా చిన్నపిల్లలకి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడానికి వెళ్లేవారు. అలాగే ఆయన ఇంకా ఎన్నో పుస్తకాలు రాయాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమ సమీక్షలు శ్రీ డా. గెలివి సహదేవుడు గారు మాట్లాడుతూ” గురువు గొప్పతనం అనేది శిష్యుల పైనే ఆధారపడి ఉంటుంది”డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించాలని ఆయన తపన. ఆధునికతకు సంబంధించినది ఈ పుస్తకం. ఈ పుస్తకం చదవడం వలన పూర్వకాలంలో ఆధునికత మరియు ఇప్పటి కాలంలో ఉన్న ఆధునికత సాంకేతికత మధ్య భేదాలు మీకు స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పుడున్న ఆధునికత వలన మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. అందరూ సాంకేతికత గురించి తెలుసుకొని మంచి మార్గంలో వినియోగించుకోవాలని విద్యార్థి విద్యార్థులకు తెలియజేశారు.

సయ్యద్ జాఫర్ అలీ గారు మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని స్వీకరించినటువంటి డా. రామకృష్ణారెడ్డి గారికి మరియు సమీక్షలు సహదేవుడు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టెలికాం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. టెలికం అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది ఇతర దేశాలతో పోటీపడేటట్టుగా మనం ముందు బాటలో అడుగులు వేస్తున్నాము. మన నంద్యాలలో ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ వెనక వెంకటేశం గారి హస్తం ఎంతో ఉంది .10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేశారు అహర్నిశలు టెలికాం అభివృద్ధి కోసం వారు ఎంతో పాటుపడ్డారు. మొబైల్ టవర్ల కోసం ఎంతో కష్టపడి నంద్యాలలో స్థాపించారు. వెంకటేశం గారి పుస్తకం రాస్తారు అంటే చాలా చరిత్ర ఉంది ఎంతో శ్రమపడి పుస్తకం రాయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదివి ఆధునికత గురించి తెలుసుకోవాలి అని తెలియజేశారు.
రచయిత కే.సి .వెంకటేశం మాట్లాడుతూ ఈ పుస్తకం నేను డా. జి. రామకృష్ణారెడ్డి కి అంకితం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలియజేశారు. సాంకేతికత ఎలా పెరిగింది అని వివరంగా ఈ పుస్తకంలో ఉన్నాయి అని తెలియజేశారు. పుస్తకాలను వృధా కానేయకుండా వాటిల్లో ఉన్న సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఎంతో కొంత జ్ఞానం అనేది పెరుగుతుందని తెలియజేశారు.2003 సంవత్సరంలో మొబైల్ టవర్స్ లేవు ఆ సందర్భంలో మన వ్యవస్థాపకులు అయిన డా.జి .రామకృష్ణారెడ్డి గారు మరియు శిల్ప రావు గారు కర్నూల్లో ఒక సదస్సు ఏర్పాటు చేసి వారు ఈ మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయడానికి ఎంతో సహాయపడ్డారు అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బిఎస్ఎన్ఎల్ విలువ కాపాడుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ పుస్తకం రాశాను చాలా మంచి విషయాలు ఈ పుస్తకంలో పేర్కొన్నాము అని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు.మరియు కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థిల అందరికి కర్నూలు జిల్లా టెలికాం చరిత్ర అనే ఈ పుస్తకాన్ని అందించార.చివరగా రచయిత అయినటువంటి కేసు వెంకటేశం గారు మరియు టెలికాం సభ్యులు పుస్తక స్వీయకర్త అయినటువంటి డా. జి. రామకృష్ణారెడ్డి గారికి ఎంతో ఘనంగా సన్మానం చేశారు.కళాశాల వారు విచ్చేసినటువంటి అతిధులైన కే. సి.వెంకటేశం గారికి, డా .గెలివి సహదేవుడు గారికి ,సయ్యద్ జాఫర్ గారికి, శ్రీ.జి.రమేష్ గారికి, సి .సుబ్బారాయుడు గారికి కళాశాల వారు ఎంతో ఘనంగా సన్మానం చేశారు.
Arattai