లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం
NANDYAL Aug29 :- శనివారం తెలుగు వ్యావహారిక పితా మహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ లయన్స్ క్లబ్ నాయకులు సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు సౌజన్యంతో స్థానిక శారదా విద్యాపీఠం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి మేడా చంద్రశేఖర్, రీజనల్ చైర్మన్ నిజాముద్దీన్, జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, సాహితీ వేత్త, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత రమణమూర్తి,శారదా విద్యాపీఠం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తెలుగు భాష ఉపాధ్యాయులు వెంకటకృష్ణ లకు లయన్స్ క్లబ్ తెలుగు భాషా దినోత్సవ పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కిరణ్ లాల్, వాసు కుట్టి, పాఠశాల కమిటీ సభ్యురాలు వసుంధర,అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai