NANDYAL :- ఆదివారం ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో,విజయ బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో, స్థానిక శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ లో రక్తదాన శిబిరం, రక్తదానం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 20 మంది రక్తదానం చేయడమే కాకుండా, పలువురు విద్యార్థులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి రక్తదానం చేయడానికి అంగీకరించారు.శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మౌలాలి రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన రక్త దాతలకు ప్రశంసా పత్రం, పండ్లు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు, నంద్యాల లయన్స్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా, కోశాధికారిగా ఎన్నుకోబడిన సందీప్, మేడా చంద్రశేఖర్, సురేష్, రక్తదాన శిబిరా నిర్వాహకుడు దాదా, విజయ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి నజీర్,జిల్లా టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మౌలాలి రెడ్డి మాట్లాడుతూ యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని తద్వారా ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. రక్తదానంపై ఉన్న ఆపోహలు తొలగించుకోవాలని కోరారు.
Arattai