NANDYAL April 23 :-జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, నంద్యాల జిల్లా: భారత ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గణతంత్ర దినోత్సవం – 2027 సంవత్సరముకుగాను పద్మ అవార్డుల నామినేషన్స్ / సిఫార్సులను ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుచున్నదనీ జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి.MNV రాజు తెలిపారు.
ఈ సంధర్భంగా MNV రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన క్రీడాకారులు 2027 వ సంవత్సరానికి గాను పద్మ అవార్డుల కొరకు నామినేషన్స్/సిఫార్సులను https://awards.gov.in వెబ్ సైట్ నందు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యస్. భరణి. మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ & చైర్మన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, రాజకుమారి ఆదేశానుసారం తెలియజేస్తున్నట్లు తెలిపారు..
దరఖాస్తు చేసుకోదలచిన అర్హులైన క్రీడాకారులు మే 15 తేదిన సాయంత్రం 05:00 గంటల లోపు WWW.awards.gov.in. వెబ్ సైట్ నందు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరములకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, నంద్యాల జిల్లా కార్యాలయం నందు సంప్రదించాలని కోరారు
Arattai