NANDYAL April22:- నంద్యాల స్థానిక గాంధీ చౌక్ దగ్గరలో ఉన్న శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల అభినందన సభ బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఆలయ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బింగుమళ్ల సుబ్బలక్ష్మయ్య గారిని మరియు పాలక మండలి సభ్యులైన వసుంధర దేవి, లక్ష్మణ్ సింగ్, వరలక్ష్మి శారదాబాయి, భారతి విజయభాస్కర్, సుబ్రహ్మణ్యం,రాజ్ పురోహిత్ బాబు సింగ్, సుబ్రహ్మణ్య శాస్త్రి (ఎక్స్ అఫీషియో సభ్యులు) లను మంత్రి ఫరూక్ ఘనంగా సన్మానించారు

చైర్మన్ సుబ్బలక్ష్మయ్య మాట్లాడుతూ భక్తులందరికీ స్వామివారి దర్శనం సులభతరం చేసేలా, ఆలయ ప్రతిష్టను మరింత పెంచేలా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తమ పాలక మండలి కృషి చేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు నిలయాలని, భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నూతన పాలక మండలి పనిచేయాలని సూచించారు. ఆలయ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బింగుమళ్ల సుబ్బలక్ష్మయ్య గారికి మరియు సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని కోరారు.

చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పాలక మండలి సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి ఆలయ ప్రతిష్టను మరింత పెంచాలని పిలుపునిచ్చారు.

ఈ అభినందన సభలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య , కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బిజెపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, జిల్లెల్ల శ్రీరాములు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మురళీధర్, మాజీ కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, ఆర్యవైశ్య సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు బింగ్ మల్లె శ్యామ్ సుందర్ గుప్తా, ప్రధమనంది దేవస్థానం చైర్మన్ చలం బాబు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బోయ రామకృష్ణ తదితర నాయకులు, ఆలయ అర్చకులు మరియు భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Arattai