వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ కొండంత అండ : MP బైరెడ్డి శబరి
NANDYAL Sep01:- వృద్ధులు, దివ్యాంగులు, వితంతు తదితర అర్హులైన పింఛన్ దారులకు ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ కొండంత అండ అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.మంగళవారం నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పెంచేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వంకు ఇదేళ్ళు పట్టిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం లోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన వెయ్యి రూపాయల ప్రకారం మూడు నెలల మూడు వేలు, పెంచిన నాలుగు వేలు, మొత్తం రూ. 7 వేలు అర్హులైన వారికి పంపిణీ చేశారని, దివ్యాంగుల మూడు వేల పెన్షన్ రెట్టింపు చేసి నెలకు ఆరువేల రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందని, 100 శాతం వికలత్వం ఉన్న దివ్యాంగులకు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన బాధితులకు నెలకు రూ. 10 వేలు ప్రతి నెల ఇంటి వద్దకే వచ్చి ఇస్తుంది మా మంచి ఉమ్మడి ప్రభుత్వం అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేసి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నాననీ, పేద, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో చేరేలా కృషి చేయడం మా ప్రభుత్వ బాధ్యత అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ కార్యక్రమంలో గడివేముల తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ వాసుదేవగుప్త, ఏ ఓ పవన్ కుమార్, టీడీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ కో -ఆప్సన్ సభ్యులు రఫిక్, గ్రామ టీడీపీ నాయకులు జయంత్ రెడ్డి, యుగంధర్, మాజీ ఎంపీటీసీ భాస్కర్, కె. బొల్లవరం బాబుల్ రెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ మాలిక్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Arattai