నంద్యాల ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
NANDYAL Sep23 :- నంద్యాల పట్టణంలోని PSC & KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం NRC లెవల్ మెగా జాబ్ మేళా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. NRC మ్యాప్ చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులతో పాటు నంద్యాల ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు కళాశాల దశ నుంచే అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుని, అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతిభావంతులైన యువతకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. జేకేసీ సమన్వయకర్త డాక్టర్ వి. రమేష్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జేకేసీ ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ జాబ్ మేళాకు 187 మంది అభ్యర్థులు హాజరుకాగా, నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం 118 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు కళాశాల ప్రిన్సిపాల్, కంపెనీల ప్రతినిధులు, అధ్యాపకులు ఉద్యోగ ఎంపిక పత్రాలను అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ సమన్వయకర్త శ్రీ కె. చంద్ర మోహన్, జేకేసీ మెంటర్లు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొని జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించడంలో తమ సహకారం అందించారు.
Arattai