నంద్యాల జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.164 కోట్ల కేటాయింపు
NANDYAL Sep22 :- నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ మరియు నంద్యాల మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి రాజ కుమారి గణియా తెలిపారు. మంగళవారం నంద్యాల పట్టణ మున్సిపల్ టౌన్ హాల్ నందు ఏర్పాటు చేసిన హైబ్రిడ్ మాన్యుటి మోడల్ (HAM) పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.164 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు గౌ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి శంకుస్థాపన చేయనున్న కార్యక్రమానికి జిల్లా నుంచి హాజరైన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రజా ప్రతినిధులు తదితర అధికారులు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం కింద జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు రూ.164 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని, ఈ అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారన్నారు.
👉🏻 నంద్యాల పట్టణం: రూ.63 కోట్లు
👉🏻 ధోన్ మున్సిపాలిటీ: రూ.21 కోట్లు
👉🏻ఆళ్లగడ్డ మున్సిపాలిటీ: రూ.21 కోట్లు
👉🏻ఆత్మకూర్ మున్సిపాలిటీ: రూ.21 కోట్లు
👉🏻 నందికొట్కూర్ మున్సిపాలిటీ: రూ.21 కోట్లు
👉🏻బేతంచెర్ల నగర పంచాయతీ: రూ.17 కోట్లు

రూ.550 కోట్లతో నంద్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి
HAM కింద కేటాయించిన రూ.63 కోట్లతో పాటు AMRUT 1.0, AMRUT 2.0, 15వ ఆర్థిక సంఘం నిధులు, మైనారిటీ సంక్షేమ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, BPS/LRS తదితర నిధులను అనుసంధానం చేస్తూ నంద్యాల పట్టణంలో సుమారు రూ.550 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ గారికి జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాన అభివృద్ధి పనులు… మంచినీటి సరఫరా:
నంద్యాల పట్టణంలోని ప్రతి ఇంటికీ నిరంతర, స్వచ్ఛమైన తాగునీటిని అందించేలా నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయనున్నారని అన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పటిష్టం చేయడంతో పాటు అదనపు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (WTP) ఏర్పాటు ఉంటుందన్నారు.

రహదారులు, కాలువల అభివృద్ధి:
పట్టణంలోని అవసరమైన ప్రాంతాల్లో నాణ్యమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, AMRUT పథకం కింద నూతన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (STP) ఏర్పాటు చేసి మురుగునీటిని శుద్ధి చేయడంతో పాటు, శుద్ధి చేసిన నీటిని అవసరమైన విధంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ పనులు చేపడుతామన్నారు. నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ నంద్యాల ఆరోగ్యకర నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు.100 శాతం ఇంటింటి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని, చెత్తను రోడ్లపై, డ్రైనేజీ కాలువల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలని అన్నారు. ఇంటింటి నుంచి సేకరించే చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వర్మీ కంపోస్ట్, సేంద్రీయ ఎరువులను తయారు చేసి కిచెన్ గార్డెన్లు, టెర్రస్ గార్డెన్లతో పాటు రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.అభివృద్ధి పనులన్నింటినీ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు సమన్వయంతోపర్యవేక్షించాలని ఆదేశించారు. పనులను పురోగతిన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ,ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Arattai