NANDYAL July20 :- నంద్యాల పట్టణ భీమవరం రహదారిలో ఉన్న అల్- ఫుర్కాన్ ఈద్గా నందు వర్షాల కోసం ఇస్తిస్కా నమాజ్, ప్రత్యేక దువాను జమాతుల్ ఉలేమా వల్ అయిమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు అబ్దుల్ హాది సయీది అధ్యక్షతన జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మౌలానా ముఫ్తి అజ్మతుల్లా పాల్గొని వర్షం కోసం దువా నిర్వహించారు. రైతులకు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని, గత కొన్ని రోజులుగా వర్షాలు లేక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ అల్లా దయవల్ల వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు బాగా పండాలని ప్రత్యేక ప్రార్థనల్లో అల్లాను వేడుకున్నారు.

నంద్యాల జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవాలని ఆ అల్లా దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మనియార్ ఖలీల్, ముస్లిం జెఎసీ నాయకులు అబులైస్, సమద్, మదరసా నిర్వాహకులు, మదరసా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత సంవత్సరం ఈ సమయానికి దాదాపుగా అన్ని ప్రాజెక్టులు, డ్యాములు, నదులు నిండాయని, కానీ ఇప్పుడు వర్షాభావం వల్ల కరువు పరిస్థితుల వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి వర్షాభావ పరిస్థితులలో ఇస్తిస్కా నమాజ్, ప్రత్యేక దువా చేయడం వల్ల ఆ అల్లా కరుణ కటాక్షాల వల్ల వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ ప్రత్యేక ప్రార్థనలో పెద్ద సంఖ్యలో పట్టణ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఇద్రిస్, మౌలానా హుసేన్ రషాది, హాఫిజ్ షరీఫ్ సాహెబ్, మౌలానాలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Arattai