NANDYAL :- నంద్యాలలో వేద విద్య మహాసభల్లో భాగంగా ఆదివారం వేద విద్యార్థుల చే నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది.నంద్యాల సంజీవ్ నగర్ రామాలయం నందు నిర్వహిస్తున్న 17వ వార్షిక వేద విద్య మహాసభల్లో భాగంగా ఆదివారం పట్టణంలో వేద విద్యార్థులచే వేదం పటిస్తూ ప్రముఖ మహిళా మణులతో కోలాట ప్రదర్శనతో ఆధ్యాత్మిక శోభ యాత్ర సంజీవ్ నగర్ రామాలయం నుండి ఆంజనేయ స్వామి ఆలయం వరకు నిర్వహించారు

అనంతరం సంజీవ్ నగర్ రామాలయం నందు ముగింపు సమావేశం నందు వేద విద్య పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జయ పత్రిక ప్రధానము నిర్వహించారు అనంతరం వేద పండితులకు సత్కారం నిర్వహించారు కార్యక్రమంలో మరియు శ్రీ జనార్ధనానంద సరస్వతీ స్వామి సాంస్కృతిక ట్రస్ట్ సభ్యులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు
Arattai