నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో అన్ని శాఖల సమన్వయంతో వినాయక నిమజ్జన ఉత్సవాలు నిర్వహణ
NANDYAL Sep :- సెప్టెంబర్ 18 : నంద్యాల పట్టణంలో వినాయక నిమజ్జ ఉత్సవం శోభాయాత్రను వైభవంగా, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందనీ న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎం డి ఫరూక్ తెలిపారు.

శుక్రవారం నంద్యాల పట్టణం వినాయక నిమజ్జనం సందర్భంగా చిన్న చెరువు నందు పరిపాలన వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, PMMFO NGO environment protection వినయ్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రివర్యులు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జ కార్యక్రమం సందర్భంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, తాగునీరు తదితర అంశాలపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలు అన్ని పండుగలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకునేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వినాయక నిమజ్జన ఉత్సవం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణతో పాటు గణేష్ నిమజ్జనోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, పోలీసు అధికారులు మరియు వివిధ శాఖల అధికారులకు మంత్రివర్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత వినాయక నిమజ్జనం లాగ ఈ సారి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా ముగిసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. వినాయక ఉత్సవ నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజలు అధికారులకు సహకరించి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గత ఐదు రోజులుగా వినాయక వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయని అన్నారు. ఐదు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా చిన్న సంఘటన కూడా చోటు చేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవం దిగ్విజయంగా సాగడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.

జిల్లా ఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయిలో ఉంటూ 5 రోజుల పాటు నిమజ్జనోత్సవ కార్యక్రమాలను మరియు శాంతిభద్రతలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా పర్యవేక్షించారని తెలిపారు.ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం మరియు వినాయక ఉత్సవ సమితి సభ్యులు, నగర ప్రజలు సమన్వయంతో బాధ్యతగా వ్యవహరించి ఉత్సవాలను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు. తుపాన్ ప్రభావం నుండి ఉపశమనం లభించదని, రాబోయే రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని వినాయకుడునీ కోరుకున్నానని తెలిపారు. వర్షాలు పడితేనే రబీ పంటలతో పాటు ఇతర పంటలు బాగా పండి రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా యువత ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికీ ఎదగాలని తెలిపారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఇప్పటివరకు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నంద్యాల పట్టణంలో వినాయక చవితి వేడుకలకు సంబంధించి 3, 4వ రోజులలో దాదాపు 70 శాతం వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తయ్యాయని తెలిపారు.. 5వ రోజు కూడా మిగిలిన విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినప్పటికీ, నిమజ్జన కార్యక్రమాలకు అవసరమైన నీటి సదుపాయాన్ని అందుబాటులో ఉంచేందుకు సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో చర్యలు చేపట్టారని తెలిపారు.

అన్ని శాఖల సమన్వయం, పోలీసు యంత్రాంగం పటిష్టమైన పర్యవేక్షణతో ఇప్పటివరకు నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని అన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కూడా ప్రశాంతంగా పూర్తయ్యేందుకు ప్రజలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలన్నారు.ఉత్సవ కమిటీలు ముందస్తుగా తీసుకున్న అనుమతులకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

పోలీసు శాఖ సూచించిన నిర్దేశిత మార్గాల్లోనే శోభాయాత్రలు నిర్వహిస్తూ, నిర్ణయించిన క్రమాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ట్రాఫిక్కు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలను పాటించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పోలీసు యంత్రాంగం సమన్వయంతో వ్యవహరిస్తే వినాయక చవితి ఉత్సవాలను మరింత ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించవచ్చు అన్నారు.
Arattai