శ్రీశైల హై స్కూల్ మరియు భారతి బీఈడీ కళాశాల ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా కార్యక్రమం
NANDYAL :- శ్రీశైల హై స్కూల్ మరియు భారతి బీఈడీ కళాశాల నందు హర్గర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు సాయిబాబా నగర్ లోని స్కూల్ ఆవరణ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది .

ఈ సందర్భంగా ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు విద్యా సంస్థల చైర్మన్ శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఆగస్టు 15న ఇంటి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని మరియు స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులకు ఘనమైన నివాళులర్పించాలని మరియు వారి యొక్క త్యాగాలను స్మరించుకోవాలని విద్యార్థిని విద్యార్థులు దేశ సమగ్రత కోసం కష్టపడి చదివి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరియు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మురళీకృష్ణ గారు ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి హెడ్మాస్టర్ నబి సాహెబ్ అధ్యాపకులు సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు పత్రిక విలేకరులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
Arattai