నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
NANDYAL Aug15 :- నంద్యాల: పి.ఎస్.సి. అండ్ కే.వి.ఎస్.సి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నంద్యాలలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. శశికళ అధ్యక్షతన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కే శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. శశికళ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులలో దేశభక్తి, జాతీయ సమైక్యత మరియు బాధ్యతాయుత పౌరసత్వ భావనలను పెంపొందించే విధంగా వేడుకలు నిర్వహించారు.
Arattai