సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం
NANDYAL Aug14:- పద్మావతి నగర్ మెయిన్ రోడ్ లో స్టేడియం దగ్గరలో ఉన్న సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రి లో శుక్రవారం నుండి ఆదివారం వరకు దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఉచిత నవజాత శిశువులు,చిన్న పిల్లల వైద్య శిబిరం శుక్రవారం ప్రారంభించారు.సూర్యన్ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నయన్ బాబా, డాక్టర్ సునీత్ లు ఏర్పాటుచేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ నయన్ బాబా,డాక్టర్ సునీత్ మాట్లాడుతూ నవజాత శిశువులకు వినికిడి పరీక్షలు,పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్ ఉచితంగా చేస్తున్నామని,చిన్నపిల్లల్లో త్వరితగతిన వినికిడి లోపం గుర్తిస్తే సరిచేయడానికి ఆస్కారం ఉంటుందని, అదేవిధంగా గుండె జబ్బులు ఉన్నట్లయితే సరైన సమయంలో ధైర్యాన్ని చికిత్స ద్వారా వారు ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడుతుందని అన్నారు. 2500 విలువగల పరీక్షలు ప్రతి శిశువుకు చేస్తున్నామని తెలిపారు. ప్రతి శిశువు ఆరోగ్యంగా ఎదగాలన్నదే మా ఆశయమని తెలిపారు.ఆదివారం సాయంత్రం వరకు నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని నంద్యాల జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదన రావు మాట్లాడుతూ సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రి లో నవజాత శిశువులు, చిన్నపిల్లల కోసం మూడు రోజులపాటు దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం, ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేయడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నయన్ బాబా, డాక్టర్ సునీత్, డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ నాగమణి ,డాక్టర్ మణిదీప్ ,ఆసుపత్రి డైరెక్టర్లు నాగ కుమార్, సుధాకర్ ,ఆసుపత్రి సిబ్బంది,శిబిరంలో చూపించుకోవడానికి శిశువులను తీసుకొచ్చిన తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Arattai