నంద్యాల జిల్లాస్థాయి చెస్ పోటీలు ప్రారంభం
NANDYAL Aug22 :- నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఎన్ ఆర్ జి చెస్ అకాడమీ నిర్వహణలో శనివారం నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో ఉన్న అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు జిల్లా స్థాయి చెస్ పోటీలు నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం చాలా అవసరమన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి చదువుతోపాటు కళలు,క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న అచీవర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మానస మాట్లాడుతూ చదరంగం క్రీడ మేధో శక్తిని,ఏకాగ్రతను ఇనుమడింప చేస్తుందని అన్నారు.జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలు 12 వివిధ వయసు విభాగాల్లో వేరు వేరుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ పోటీల లో ప్రతిభ కనబరిచిన వారికి ఒక్కొక్క క్యాటగిరి లో 10 ప్రైజ్ ల చొప్పున మొత్తం 120 ప్రైజ్ లను ఇవ్వడం జరుగుతుందన్నారు.అచీవర్స్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ టోర్నమెంట్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్, మేడా చంద్రశేఖర్, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మానస, పాఠశాల ప్రిన్సిపల్ లావణ్య, చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి, వ్యాయామ ఉపాధ్యాయుడు వంశీ, టోర్నమెంట్ ఆర్గనైజర్ అరుణ్ కుమార్, ఆర్బిటర్స్ మహేష్ మాలిక్ సురేష్ జయంత్ మాధవి రమ్య మణికుమార్,200 మంది చెస్ క్రీడాకారులు, కోచ్ లు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Arattai