నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం టెక్కే నందుగల నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మెన్ & ఉమెన్ పోటీలు వేరువేరుగా నిర్వహించడం జరిగింది
జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వాహనలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి బోర్డుపై పావులు కదిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ సాయి రోహిత్ మరియు నారాయణ రెడ్డి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ లు పాల్గొన్నారు

డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ చదరంగం క్రీడ ఏకాగ్రతను ఇనుమడింపచేస్తుందని తద్వారా చదువు లో కూడా రానిచడానికి అవకాశలు అధికమవుతాయి అని అన్నారు.
నంద్యాల పట్టణం నుండి ఇంటర్నేషనల్ రేటింగ్ తెచ్చుకున్న మొదటి బాలిక శాలిని ని మెమొంటోతో సత్కరించారు.నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈరోజు జరిగే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు బాపట్లలో జరుగుతున్న రాష్ట్ర పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కర్రస్పాండెంట్ కృష్ణ సాయి రోహిత్ మరియు నారాయణ రెడ్డి బ్యాంక్ మేనేజర్ టోర్నమెంట్ ఆర్బిటర్ సుజాత,100 మంది క్రీడాకారులు వారి తల్లిదండ్రులు చెస్ కోచ్ లు పాల్గొన్నారు
Arattai