
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల కోసం నిర్దేశించిన మూడు శాతం కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 4 జారీ చేశారు.
ఈ జీవో ద్వారా దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయస్థాయిలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఈ సందర్భంగా జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలపడం కోసం, జీవోపై దివ్యాంగ క్రీడాకారులలో అవగాహన పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో, రాష్ట్ర పారా స్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మొదలుపెట్టిన రాష్ట్ర వ్యాప్త పారాస్పోర్ట్స్ చైతన్య రథయాత్ర శనివారం నంద్యాలకు చేరుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం, నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఫరూక్ క్యాంపు కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షులు డాక్టర్ గుర్రాల రవికృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వెదుర్ల రామచంద్రరావు, ఏ.వి.ఆర్.ప్రసాద్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, యాత్ర నిర్వాహకులు, రాష్ట్ర పారా స్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి,జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం కార్యదర్శి ఎం.పి.వి రమణయ్య లతో కలిసి పారాస్పోర్ట్స్ చైతన్య యాత్ర గోడ పత్రికలను(పోస్టర్స్) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో నంద్యాలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మూడు వేల నుండి పెన్షన్ ఆరు వేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిందని, అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం దివ్యాంగ క్రీడాకారులకు జీవో నెంబర్ నాలుగు ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం దివ్యాంగ క్రీడాకారులకు గొప్ప వరం లాంటిదన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని,దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో క్రీడలు నేర్చుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్థానికంగా దివ్యాంగులకు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం కేటాయించి,ఇల్లు కట్టించడంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు.
డాక్టర్ రవి కృష్ణ, రామస్వామి, ఎంపీ వి రమణయ్య మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి పెన్షన్ రెట్టింపు చేయడమే కాకుండా క్రీడా పాలసీలో దివ్యాంగ క్రీడాకారులకు ప్రత్యేక వసతులు కల్పిస్తూ, దివ్యాంగ క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పరుస్తూ, విశాఖపట్నంలో 22 ఎకరాలలో ప్రత్యేక దివ్యాంగ క్రీడాకారుల స్టేడియం నిర్మాణానికి పూనుకుని, దివ్యాంగ క్రీడాకారులు ఒలింపిక్స్ లో, అంతర్జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన వారికి ఏడు కోట్లు, రజత పతకం సాధించిన వారికి ఐదు కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి మూడు కోట్లు,ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి మూడు కోట్లు, రజత పతకం సాధించిన వారికి రెండు కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి కోటి రూపాయలు ప్రోత్సాహక బహుమతులు ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పారాస్పోర్ట్స్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శులు వెదుర్ల రామచంద్రరావు, ఏ వి ఆర్ ప్రసాద్, రాష్ట్ర పారా స్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి,నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య, కౌన్సిలర్ శ్యాంసుందర్ లాల్, మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి, చలం బాబు,పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రలో పాల్గొంటున్న గుంటూరు పారాస్పోర్ట్స్ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, నెల్లూరు జిల్లా పారాస్పోర్ట్స్ సంఘం అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు, జాతీయ స్థాయి పతకం సాధించిన దివ్యాంగ క్రీడాకారుడు వెంకట్, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, వెంకటరావు, ప్రధాన కార్యదర్శి రామలింగం,దివ్యాంగ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ్ కిషోర్, జిల్లా పారాస్పోర్ట్స్ సమన్వయకర్త హనీఫ్ ఖాన్, ఉపాధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్,కార్యదర్శి ఇంతియాజ్, సంయుక్త కార్యదర్శులు మధు కుమార్, దుర్గారావు, కోశాధికారి ఆలా మధు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply