నంద్యాల జిల్లా రేవనూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారులు మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది సమయాపాలన తప్పనిసరిగా పాటించవలెనని లేనిచో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా DMHO వెంకటరమణ హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని ఓపి విభాగాన్ని మరియు అక్కడ ఉన్నటువంటి రోగులకు వారికి అందే సేవలు మరియు చికిత్సలు మందులు వారి పట్ల వైద్యాధికారి మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారో మరియు ఓపి విభాగంలోని రికార్డులను మరియు రిపోర్టులను ఈ సందర్భంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల IEC మెటీరియల్ ప్రదర్శనను అవగాహన కొరకు ప్రజలకు మరియు రోగులకు అందులో అందుబాటులో ఉండే విధంగా ప్రదర్శన లేనిచొ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు

Leave a Reply