ప్రపంచ గుండె దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన ఎస్పీ సునీల్ షేరాన్

సోమవారం ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా ఇండస్ హార్ట్ ఆసుపత్రి, నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో “గుండ రక్షణ కోసం నడక” ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు.

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని నడక ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మితాహారం, తగినంత వ్యాయామం, పొగ తాగడం వంటి ఇతరులవాట్లకు దూరంగా ఉండటం ద్వారా గుండెను పది కాలాలపాటు పదిలంగా రక్షించుకోవచ్చు అని అన్నారు.

ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు మాట్లాడుతూ ప్రజల అవగాహన కోసం ఐఎంఏ ఆధ్వర్యంలో వివిధ రకాల వ్యాధుల పట్ల తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి ర్యాలీలు,సదస్సులు ఆయా జబ్బుల ప్రత్యేక రోజులలో నిర్వహిస్తూ ఉన్నామన్నారు.

ఇండస్ ఆసుపత్రి గుండె జబ్బుల వైద్య నిపుణులు  డాక్టర్ జహంగీర్,డాక్టర్ మురళీకృష్ణ,గుండె  శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ కోటి శ్రీనివాస్ మాట్లాడుతూ  స్థూలకాయం రాకుండా చూసుకోవడం ద్వారా, షుగరు బీపీ వంటి జబ్బులు ఉన్నవారు సరైన చికిత్స తీసుకుంటూ నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా, నిత్యం క్రమం తప్పకుండా నడక తదితర వ్యాయామాలు చేయడం ద్వారా, పొగాకు దూరంగా ఉండటం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు అన్నారు.

సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

ఇండస్ ఆసుపత్రి గుండె జబ్బుల వైద్య నిపుణులు  డాక్టర్ జహంగీర్,డాక్టర్ మురళీకృష్ణ,గుండె  శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ కోటి శ్రీనివాస్ మాట్లాడుతూ  స్థూలకాయం రాకుండా చూసుకోవడం ద్వారా, షుగరు బీపీ వంటి జబ్బులు ఉన్నవారు సరైన చికిత్స తీసుకుంటూ నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా, నిత్యం క్రమం తప్పకుండా నడక తదితర వ్యాయామాలు చేయడం ద్వారా, పొగాకు దూరంగా ఉండటం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు అన్నారు.

ఛాతీ లో నొప్పి, ఒళ్లంతా చెమటలు పట్టడం,ఛాతీ నొప్పి భుజానికి, వెనుకకు, దవడకు పాకినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు అజాగ్రత్త చేయరాదన్నారు. ఎటువంటి శ్రమ, మెట్లు ఎక్కడం,ఎక్కువ దూరం నడవడం లాంటివి చేయకుండా వెంటనే ఈసీజీ తీసి ఇతర పరీక్షలు చేసి అది గుండె పోటా కాదా అని నిర్ధారణ చేసే ఆసుపత్రుల దగ్గరికి వెళ్లడం ఎంతో అవసరం అన్నారు.

గుండెపోటు వచ్చిన సమయంలో మొదటి గంట చాలా కీలకమన్నారు. ఆ సమయంలో సరైన చికిత్స చేస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు అన్నారు. ఒకసారి గుండెపోటు వచ్చిన వారు యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకుని గుండె రక్తనాళాలు మూసుకుపోయి ఉన్నాయా లేదా చూసుకుని అవసరం అయితే యాంజియో ప్లాస్టి, లేదా ఎక్కువ నాళాలు మూసుకుపోతే బైపాస్ ఆపరేషన్ చేయించుకోవలసి ఉంటుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ చికిత్సలను పొందుపరిచారని అన్నారు.

భవిష్యత్తును మార్చేది సంస్కరణలే: సీఎం చంద్రబాబు

ఇండస్ ఆసుపత్రి నుండి ప్రారంభమైన “గుండె రక్షణ కోసం నడక ” ర్యాలీ సంజీవనగర్ గేట్ వరకు కొనసాగింది.పెద్ద ఎత్తున వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది గుండె రక్షణకు సంబంధించిన స్లోగన్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, టూ టౌన్ సిఐ అస్రార్  భాష, వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ హరినాధ రెడ్డి, డాక్టర్ విజయబాబు, డాక్టర్ వివేకానంద రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ షర్మిల, డాక్టర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.