నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీ,స్పటిక లింగేశ్వర ఆలయంలోని అమర యోగ వికాస కేంద్రం నందు మంగళవారం ఆశ్వీయుజమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు.

నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో ఉదయం స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం లోక కళ్యాణార్థం గాయత్రి హోమాన్ని నిర్వహించారు.అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా యోగానంద మాట్లాడుతూ అమర యోగ వికాస కేంద్రం నందు ప్రతినెల పౌర్ణమి రోజున లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిమ్మయ్య,అనిల్,శ్రీనివాసరెడ్డి, రఘునాథ రెడ్డి యోగ సభ్యులు పాల్గొన్నారు
Leave a Reply