AP-ఆటో డ్రైవర్ల సేవలో మైనారిటీలకు రూ.41.37 కోట్లు లబ్ది: మంత్రి ఎన్ఎండి ఫరూక్

అమరావతి అక్టోబరు7:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన “ఆటో డ్రైవర్ల సేవలో” పథకంలో భాగంగా మైనారిటీల వర్గాలకు చెందిన డ్రైవర్లకు రూ.41.37 కోట్లు లబ్ధి చేకూరిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం అమరావతి లో విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు లో 27,580 మంది లబ్ధిదారులకు రూ.15,000 ప్రకారం వారి వారి అకౌంట్లకు ప్రభుత్వం నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు. వైసిపి ప్రభుత్వ హాయంలో మైనారిటీ వర్గాలకు చెందిన డ్రైవర్లకు ఒక్కొక్కరికి కేవలం రూ.10,000 ప్రకారం 24,393 మందికి రూ.24.39 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు.

AP-ఎపి సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా సాగిన మంత్రుల బృందం సమావేశం

కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందుల నుండి తప్పించేందుకు అర్హులైన ఆటో, తదితర డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం “ఆటో డ్రైవర్ల సేవలో ” పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు.

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 3977 మందికి, బీసీ కార్పొరేషన్ ద్వారా (బి.సి –ఈ ముస్లింలకు)22,975 మందికి, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 628 మంది మైనారిటీలకు “ఆటో డ్రైవర్ల సేవలో” పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు

గత వైసిపి ప్రభుత్వం కంటే 70 శాతం మొత్తం అధికంగా కూటమి ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు.ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమ కార్యక్రమాలను,పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.