బుధవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతన కేంద్రీయ విద్యాలయ తరగతులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు.ఈ సందర్బంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యపట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యకు అధిక నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు.

ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ప్రిన్సిపాల్ ను బదిలీ చేసి ఆ మంచి కార్యక్రమం పూర్తి చేసేలా ప్రభుత్వం బాధ్యత అప్పగిస్తుందని, మూడు సమస్యలు తొలగించి నాల్గవ బాధ్యత డోన్ కేంద్రీయ విద్యాలయం అప్పగించడంతో ఎన్నో సమస్యలు ఉన్నా తక్కువ సమయంలో వాటిని పూర్తి చేసి నేడు డోన్ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభం కావడానికి శ్రమించిన ప్రిన్సిపాల్ ఎం. మాలిక్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి అనడంతో హార్షద్వనాలు మొగాయి.

ఎవరో తెచ్చింది కాదని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కవగా ఉన్న చోట, ప్రతి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తుందని, అందులో భాగంగానే నంద్యాలలో ఏర్పాటు చేయాల్సిన ఈ విద్యాలయం డోన్ లో ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా కేంద్రం నంద్యాలలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉండడంతో మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని తాను కేంద్ర ప్రభుత్వంను కోరగా మంజూరుకు అంగీకారం తెలిపినట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.
కేంద్రీయ విద్యాలయంలో చదువుకునేందుకు చాలా పోటీ ఉందని, ఇక్కడ సీటు వచ్చిందంటే మీ పిల్లలు ఎంతో అదృష్టవంతులని, వారు ఇక సెటిల్ అయినట్లేనని, తల్లిదండ్రులు నిచ్చింతగా ఉండొచ్చాన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే సిలబస్ తో ఇక్కడ విద్య అందుతుందని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయ్యేప్పుడు విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఒకే సిలబస్ తో కేంద్రీయ విద్యాలయంలో విద్యాబోధన ఉంటుందనీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇక్కడ ఉంటుందన్నారు. హిందీ చదవడం, వ్రాయడం నేర్చుకున్న విద్యార్థులు దేశంలో ఎక్కడైనా రానించగలరని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు
తాను పార్లమెంటరీ విద్యా సలహా కమిటీ సభ్యురాలుగా ఉన్నానని, ఈ అవకాశం ఉపయోగించుకొని రాష్ట్రానికి, నంద్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యకు ఎక్కువ నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానన్నారు.
డోన్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకునే విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రానించాలని, ఏ అవసరం వచ్చిన తనకు ఫోన్ ద్వారా కలిసి సమస్య పరిష్కారించుకోవాలని, విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలు అవరోధించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విద్యార్థులను దీవించారు. ఈ కార్యక్రమంలో డోన్ ఆర్ డి ఓ కె. పి. నరసింహులు, డోన్ అర్బన్ సి ఐ ఇర్ఫాన్, అధ్యాపకులు పాల్గొన్నారు
Leave a Reply