నంద్యాల అక్టోబరు 13:- కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం జీ ఎస్ టీ తగ్గించడంతో అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం నెలకొని ఉందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్ర సందర్శన, కర్నూలు జిల్లా నన్నూరు వద్ద భారీ బహిరంగ సభ ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు జన సమీకరణ పై సన్నాహక సమావేశం సోమవారం జరిగింది.రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధ్యక్షతన, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నేతృత్వంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తో జన సమీకరణ ఏర్పాట్లపై విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్ లో జరిగిన సమావేశానికి పరిశీలకులుగా పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, నంద్యాల అసెంబ్లీ టిడిపి పరిశీలకుడు ఆలం నరస నాయుడు హాజరయ్యారు. తెలుగుదేశం,బిజెపి, జనసేన పార్టీల బూత్, యూనిట్, క్లస్టర్ స్థాయి ఇన్చార్జిలు,నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం కోసం భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు వెల్లడించారు.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 25,000 మందికి పైగా జన సమీకరణ కోసం నంద్యాల మున్సిపాలిటీలోని వార్డుల వారీగా,నంద్యాల మండలం, గోసుపాడు మండలాల్లోని అన్ని గ్రామాల వారీగా ప్రత్యేకంగా బస్సులు, వాహనాలు కేటాయింపు, భోజన సౌకర్యం, సభా స్థలం వద్దకు చేరిక, తిరిగి అక్కడినుండి సొంత ప్రాంతాలకు చేరవేత పై అన్ని మౌలిక సదుపాయాలతో ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. కూటమి పార్టీల నాయకులు సమన్వయంతో ప్రధాని పర్యటన ను విజయవంతం చేయాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో ప్రజలపై తగ్గిన భారం తో ప్రజల్లో ఆనందం నెలకొని ఉందన్నారు.

జీఎస్టీ బహిరంగ సభకు కర్నూలుకు రావాలని,ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం సందర్శనకు రావాలని ప్రధానిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించడం, ప్రధాని పర్యటన ఖరారు అవడంతో ఉమ్మడి జిల్లా పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని మంత్రి ఫరూక్ ఆశాభావం వ్యక్తం చేశారు .ప్రధాని మోదీ పర్యటన ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులుగా మనందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు. క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు కార్యకర్తలు బాధ్యతగా కలిసికట్టుగా పనిచేసి ప్రధాని మోదీ పర్యటన బహిరంగ సభ ను విజయవంతం చేయాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు.
సొంత కుటుంబం కార్యక్రమంలాగా భావించాలి – జన సమీకరణ ఏర్పాట్ల ప్రత్యేక పరిశీలకులు పిలుపు
నంద్యాల నుంచి భారీగా జన సమీకరణ చేపట్టి ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని నియోజకవర్గ జన సమీకరణ ఏర్పాట్ల ప్రత్యేక పరిశీలకులు పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు,శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, టిడిపి నియోజకవర్గ పరిశీలకుడు ఆలం నరస నాయుడు లు పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశంలో జన సమీకరణ పై కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వారు ప్రసంగించారు.పట్టణంలో వార్డుల వారీగా,గ్రామాల వారీగా ఎన్ని బస్సులు, ఏ టైంలో ప్రారంభమవుతాయనే విషయంలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారని, అధికారుల క్షేత్రస్థాయి ఏర్పాట్లకు కూటమి పార్టీలోని మనమంతా నిలబడాలని సూచించారు.

ప్రధాని సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రవాణా, ఆహార సదుపాయం ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఎవరు పిలిచినా పిలవకపోయినా ఇది మన సొంత కుటుంబాల్లోని కార్యక్రమంగా భావించి కూటమి కార్యకర్తలు నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల నియోజకవర్గం నుంచి కూటమి పార్టీ నేతలు, గ్రామాలు వారిగా టార్గెట్ పెట్టుకుని జన సమీకరణ చేయాలని పేర్కొన్నారు.ప్రధాని మోదీసభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సూచించారని అందుకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా అధికార యంత్రాంగంతో కలిసి, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో భాగస్వామ్యం అవ్వాలని పరిశీలకులు పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ పర్యటనకు క్షేత్రస్థాయి ప్రజల నుంచి కూడా ఊహించని స్పందన, అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూటమి కార్యకర్తలపై ఉందన్నారు.ప్రధాని సభకు తరలి వచ్చే మహిళలు,యువత, వృద్ధులకు తగిన విధంగా రవాణా,ఆహార ఏర్పాట్లు,రవాణా, ఆహారం, తాగునీరు వంటి సదుపాయాలు విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జన సమీకరణ ఏర్పాట్లపై కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు ప్రసంగించారు.

నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ లో జరిగిన ప్రధాని మోదీ పర్యటన సభ విజయవంతం కోసం సన్నాహక సమావేశానికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు వెదుర్ల రామచంద్రారావు, ఏవిఆర్ ప్రసాద్, మార్కుఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు,బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఇంటి ఆదినారాయణ, కశెట్టి కృష్ణమూర్తి,జనసేన నియోజకవర్గ సమన్వయకర్త పిడతల సుధాకర్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మనీయార్ ఖలీల్, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి,కూటమి పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు
Leave a Reply