రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని, కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వైఎస్ఆర్సిపి మహిళ నేతలు, వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రజా సంఘాల మహిళలు ప్రజాప్రతినిధులు, పట్టణంలోని మహిళలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి వినతిపత్రం అందజేశారు.నకిలీ మద్యాన్ని అరికట్టాలని, మమహిళల చిన్నారుల వృద్ధుల మానప్రాణాలను కాపాడాలని, రక్షణ కల్పించాలని నంద్యాల మహిళలు వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వైసిపి మహిళలు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి అనేకమంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారని, కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వీటన్నిటిని చూస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి చోద్యం చూస్తూ ఉండటం సరికాదని తెలిపారు. మద్యం సేవించిన వారు మహిళలను వేధింపులకు గురి చేస్తూ హత్యలు, అత్యాచారాలు, దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటువంటి నకిలీ మద్యాన్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

మద్యం తాగిన వ్యక్తులు విచక్షణ కోల్పోయి తల్లి , చెల్లి కానరాక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వాపోయారు. ముఖ్యంగా చిన్నారులపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతున్నదని, కూటమి ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించలేని పరిస్థితికి వచ్చిందని, పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. కల్తీ మద్యాన్ని నియంత్రించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మున్సిపల్ చైర్ పర్సన్ మాభున్నిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ రామలింగారెడ్డి, స్టేట్ జనరల్ సెక్రెటరీ వైఎస్ఆర్సిపి మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళ రెడ్డి, మాజీ దృశ్యకలాల డైరెక్టర్ సునీత అమృతరాజ్, జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృత రాజ్, జిల్లా జనరల్ సెక్రెటరీ దేవనగర్ భాష,నంద్యాల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, అసెంబ్లీ లీగల్ గ్రీవెన్స్ అధ్యక్షుడు వివేకానంద రెడ్డి, ,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, క్రిస్టియన్ మైనారిటీ అసెంబ్లీ అధ్యక్షుడు మనోజ్ , వైసిపి అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, అసెంబ్లీ మహిళ అధ్యక్షురాలు హుస్సేనమ్మ, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ హైమావతి, నంద్యాల మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్, నంద్యాల మండలం వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వర రెడ్డి, కౌన్సిలర్స్ కృష్ణమోహన్ మేష చంద్రశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి ,సుబ్బలక్ష్మి, శాదిక్ భాష, సర్పంచులు కోటిరెడ్డి, రామసుబ్బయ్య రఘురామిరెడ్డి, ఐజయ్య, సుబ్బయ్య, మాజీ కౌన్సిలర్స్ మునయ్య కన్నమ్మ జాకీర్ హుస్సేన్, లక్ష్మీనారాయణ, పూన్న శేషయ్య, వైసీపీ నాయకులు, గన్ని కరీం, కిరణ్ కుమార్ సాయిరాం రెడ్డి ,రహంతుల్లా పార్ధుడు, ఎద్దు రవి, జలీల్, కాల్వ నాగరాజు, చాణిక్య రాజు, మూలసగరం భాస్కర్ రెడ్డి, మధు గౌడ్, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు
Leave a Reply