జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపరాదని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.

సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ నందు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, డిఆర్ఓ రామునాయక్, ఎస్డిసిలు, డిఆర్డిఎ పీడి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఉండాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా నిర్ణీత గడువు లోపల పరిష్కరించి
రీ ఓపెన్ కి తావు లేకుండా చూడాలన్నారు.

జిల్లాలో భూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు.
ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అలా పరిష్కరించడం వల్ల ప్రజలకు అధికారులపై నమ్మకం కలుగుతుందన్నారు. ప్రజల నుంచి సేకరించిన ఫీడ్ బ్యాక్ ను కూడా ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోందని ఈ విషయాన్ని అధికారులు గుర్తించి ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మాట్లాడాలన్నారు. ఇకనుంచి జిల్లా అధికారులు పిజిఆర్ఎస్ అర్జిలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు
Arattai