NANDYAL April 26:- నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం నందు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు దేవస్థానం అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆచారి తెలిపారు.

స్వామివారికి పంచామృత అభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.స్వామి వారి కాలజ్ఞాన సందేశాలు ఈ కాలంలో కూడా ప్రజలకు మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు.అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ ఆచారి,ప్రధాన కార్యదర్శి సుబ్బాచారి,సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ ఆచారి, శ్రీనివాసచారి కోశాధికారి వీరభద్రా చారి పాల్గొన్నారు.
Arattai